ఏడు రోజుల్లో కోటి మందికి పైగా రేషన్ సరఫరా.. మంత్రి కీలక వ్యాఖ్యలు!
Sat Jun 07, 2025 14:18 Politics
రాష్ట్ర ప్రజా పంపిణీ చరిత్రలో ఒక గొప్ప మైలురాయిగా ఏడు రోజుల్లో కోటి మందికి పైగా రేషన్ సరుకులు అందించడం గర్వకారణమని రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల మరియు వినియోగదారుల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన పౌర సరఫరా విధానంలో భాగంగా జూన్ 1వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా 29,796 చౌక ధరల దుకాణాల ద్వారా 1,46,21,232 మంది రేషన్ కార్డుదారులకు సరుకుల పంపిణీ ప్రారంభమైంది. ఈ ఏడు రోజుల వ్యవధిలో 1,05,27,767 మంది కార్డుదారులకు రేషన్ అందజేశామని మంత్రి తెలిపారు. అంటే 72 శాతం మందికి రేషన్ సరుకులు అందజేశామన్నారు. అదేవిధంగా 98,77,670 మంది కార్డుదారులకు పంచదార పంపిణీ చేశామని, ఇది 67.56 శాతమని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. 65 సంవత్సరాల పైబడిన వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ఇంటి వద్దకే సరుకులు అందించే సేవను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు.
ఇది కూడా చదవండి: సీనియర్ నేత రాజీనామా.. టీడీపీకి గుడ్ బై చెప్పిన రాయలసీమ ముఖ్యనేత!
ఇప్పటివరకు 11,05,439 మందికి ఈ విధంగా పంపిణీ చేసినట్లు వెల్లడించారు. రేషన్ తీసుకునే కుటుంబాల సంఖ్యలో గణనీయమైన పెరుగుదల కనిపిస్తుందన్నారు. “ఇంటింటికీ సేవ” లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని, ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు లబ్ధిదారులు ఉదయం నుంచి సాయంత్రం వరకు తమకు అనుకూల సమయాల్లో రేషన్ సరుకులు తీసుకునే వెసులుబాటు కల్పించామని తెలిపారు. రేషన్ షాపుల్లో వినియోగదారుల కోసం మరింత సౌకర్యవంతమైన వ్యవస్థను ఏర్పాటు చేశామని, గతంలో ఉన్న పాత రేషన్ విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టామని గుర్తు చేశారు. సరఫరా వ్యవస్థలో పొరపాట్లకు తావు లేకుండా, సేవా దృక్పథంతో డీలర్లు పనిచేయాలని సూచించారు. పారదర్శకంగా, బాధ్యతతో, ప్రజల సౌకర్యం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: ఆ జాతీయ రహదారికి గ్రీన్ సిగ్నల్! ఆరు మండలాల్లో 20 గ్రామాలలో భూసేకరణ! భూముల ధరలకు రెక్కలు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
పార్టీలో చేరికలపై నేతలకు కీలక ఆదేశాలు జారీ! కేంద్ర కార్యాలయానికి..
జగన్ పెంచి పోషించిన మత్తు భూతం రాష్ట్రాన్ని వదల్లేదు! తిరుపతిలో స్థానికులు ఆగ్రహం వ్యక్తం!
ఆ 8 జిల్లాలతో పాటు విశాఖ ఆర్థిక ప్రాంతం.. లక్ష ఎకరాల్లో ప్రాజెక్టులు.. అదిరిపోయే బాబు ప్లాన్!
అదిరిపోయే శుభవార్త: ఏపీలో భారీగా నిల్వలు.. తవ్వుతుంటే కిలోలకి కిలోలే బయటికి వస్తుంది!
ఏపీ మహిళలకు శుభవార్త! ఒక్కొక్కరికి రూ.లక్ష ఇస్తారు, దరఖాస్తు చేసుకోండి!
షుగర్ అని భయపడుతున్నారా.. అయితే దీన్ని తీసుకోవడం వల్ల ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు!
రెడ్ అలర్ట్! ఆ జిల్లాల్లో కుండ పోత వర్షాలు! ప్రజలు బయటకు రావద్దు!
గుడ్ న్యూస్.. మరో రెండు నెలల్లో భారీగా తగ్గనున్న బంగారం ధరలు! 12 - 15% తగ్గే అవకాశం!
బంపర్ ఆఫర్.. దుబాయ్ లాటరీలో విమాన టిక్కెట్లు, ఫోన్లు గెలుచుకోండి ఇలా! ఈ అవకాశం పోతే మళ్ళీ రాదు..
ఓ ఇంటి వాడైన అక్కినేని వారసుడు అఖిల్.. హాజరైన సినీ తారలు!
బిగ్ అప్డేట్.. ఈ విషయం తెలియకుండా అస్సలు ఫ్లైట్ ఎక్కొద్దు.. లేదంటే మీ పని అంతే.!
అమెరికాలోకి ప్రవేశంపై 19 దేశాలకు షాక్.. ట్రంప్ నుంచికొత్త ప్రయాణ నిషేధ ఉత్తర్వులు!
రైతులకి గుడ్ న్యూస్.. పంటకి కేంద్ర ప్రభుత్వం భారీ ఆర్థిక సాయం! దరఖాస్తు ఇలా..
నా తప్పు మృగాళ్లందరికీ కనువిప్పు కావాలి.. పాపా నువ్వయినా నన్ను క్షమిస్తావా!
జగన్‌పై కేంద్రమంత్రి ఆగ్రహం.. మీ తీరు మారకపోతే ఈసారి మిగిలేది ఒక్కటే!
ట్రంప్ సంచలన నిర్ణయం.. విద్యా, దౌత్య వర్గాల్లో తీవ్ర ఆందోళన! వీసాల రద్దుకు కూడా ఆదేశాలు..
హామీల అమలుపై చర్చకు రావాలి.. వైకాపాకు మాజీ మంత్రి, తెదేపా ఎమ్మెల్యే సవాల్!
యువగళం పుస్తకం.. లోకేష్‌కు పవన్ అభినందనలు! ఆనాటి అనుభవాలను కళ్లకి కట్టినట్లుగా..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #RationCard #AndhraPradesh #appolitics #apNews #NadendlaManohar #SevenDays #Over1Crore #APNews
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.